సంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించి అందరినీ మెప్పించిన సంయుక్త ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.
ఆ సినిమాలో నిత్యా మీనన్ మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ సంయుక్త అందరి దృష్టినీ ఆకర్షించింది. తన అందం, అభినయంతో ఆడియన్స్ ను మెప్పించిన సంయుక్తకు తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి.
బింబిసార, సార్, విరూపాక్ష లాంటి సినిమాల్లో నటించడమే కాకుండా లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.
రీసెంట్ గా బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ2 సినిమాలో నటించి మెప్పించిన సంయుక్త త్వరలోనే మరో సినిమాతో పలకరించనుంది.
శర్వానంద్ హీరోగా వస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమాలో హీరోయిన్ గా నటించిన సంయుక్త పండక్కి ఈ సినిమాతో తన లక్ ను మరోసారి టెస్ట్ చేసుకోబోతుంది.