గులాబీ పూల అందం ప్రతి ఇంటికీ ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కుండీలోనూ గులాబీలు విరివిగా పూస్తాయి.
నర్సరీలో మొక్క కొనుగోలు చేసే సమయంలో పూల కంటే ఆరోగ్యమైన కొమ్మలు ఎక్కువగా ఉన్న మొక్కను ఎంపిక చేయడం మంచిది. అలా తీసుకున్న మొక్క త్వరగా పెరుగుతుంది.
గులాబీకి మట్టి సిద్ధం చేయడం చాలా ముఖ్యమైన పని. ఎర్రమట్టిలో ఇసుక, చిన్న కంకరతో పాటు కోకో పీట్ కలిపితే వేర్లు బలంగా పెరుగుతాయి.
ఈ మొక్కకు మంచి ఎండ అవసరం ఉంటుంది. రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు గంటలు సూర్యరశ్మి తగిలితేనే పూలు అందంగా పూస్తాయి.
పువ్వులు వాడిపోయిన తర్వాత వాటిని అలాగే వదిలేయకూడదు. కొద్దిగా కింద భాగంలో కట్ చేస్తే అక్కడ కొత్త చిగుర్లు వస్తాయి.
మజ్జిగ, బెల్లం, ఆవుపేడ పులియబెట్టి చేసిన సేంద్రీయ మిశ్రమం గులాబీ మొక్కలకు మంచి శక్తినిస్తుంది. ఇవి సహజ ఎరువుల్లా పనిచేస్తాయి.
ఉల్లిపాయ పొట్టు, అరటి తొక్కలు, టీ వేస్ట్ మట్టిలో కలిపితే మొక్కలకు పోషకాలు అందుతాయి. వారానికి ఒకసారి వేపనూనె స్ప్రే చేస్తే తెగుళ్లు కూడా తగ్గుతాయి.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో రోజాపూలు గొత్తుల గుత్తుగా అందంగా పూసి మీ తోటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.