క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవాల‌ని చూస్తోంది ఆషికా రంగ‌నాథ్‌.

అమిగోస్ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న న‌టించి ఆ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆషికా మొద‌టి సినిమాతోనే అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌తో క‌లిసి నా సామిరంగ అనే మూవీలో న‌టించి అంద‌రినీ త‌న న‌ట‌న‌తో ముగ్ధుల్ని చేసింది ఆషికా.

ఆ సినిమా స‌క్సెస్ త‌ర్వాత తెలుగు, క‌న్న‌డ‌, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ అయిన ఆషికా చిరంజీవి హీరోగా వ‌స్తున్న విశ్వంభ‌ర‌లో కీల‌క‌పాత్ర చేస్తోంది.

తాజాగా ర‌వితేజ‌తో క‌లిసి భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి అనే సినిమాలో న‌టించి, సంక్రాంతి సంద‌ర్భంగా ఆ సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌కరించి, ఆ మూవీలో త‌న యాక్టింగ్ తో ఆడియ‌న్స్ ను మెప్పించింది ఆషికా.