ఎండలోకి వెళ్లడానికి 20 నిమిషాల ముందే రాయాలి. అప్పుడే అది చర్మంలోకి ఇంకి రక్షణ కవచంలా మారుతుంది.
ముందే అప్లై చేయండి
చూపుడు, మధ్య, ఉంగరపు వేళ్ల పొడవునా సన్‌స్క్రీన్ తీసుకోండి. ముఖం, మెడకు ఇది సరైన పరిమాణం అని పరిశోధనల సారాంశం.
3 వేళ్ల నియమం
కేవలం ముఖమే కాదు.. చెవులు, మెడ, చేతులు ఇలా ఎండ తగిలే ప్రతి భాగంపై సన్‌స్క్రీన్ తప్పక అప్లై చేయాలి.
అన్ని చోట్లా రాయండి
చిన్న చిన్న చుక్కలుగా పెట్టి సున్నితంగా మర్దనా చేయండి. ఇలా చేస్తేనే చర్మం అంతటా సమానమైన రక్షణ లభిస్తుంది.
సమానంగా రాయండి
ప్రతి 2 గంటలకొకసారి సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోవద్దు. స్విమ్మింగ్ లేదా చెమట పట్టినప్పుడు ఇది మరింత అవసరం.
మళ్లీ అప్లై చేయాలి
సన్‌స్క్రీన్‌ను మేకప్‌తో కలపకండి. మేకప్ పైన కావాలంటే సన్‌స్క్రీన్ స్ప్రే లేదా పౌడర్ రూపంలో వాడటం ఉత్తమం.
మేకప్‌కు ముందే..
కనీసం SPF 30 ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ వాడండి. ఇది 97% హానికర కిరణాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
SPF 30+ ఎంచుకోండి
కిటికీ అద్దాల నుండి UV కిరణాలు లోపలికి వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్నా సన్‌స్క్రీన్ వాడటం చర్మానికి క్షేమం.
ఇంట్లో ఉన్నా సరే
సాధారణ బామ్‌లు సరిపోవు. SPF 30+ ఉన్న లిప్ బామ్ వాడండి. సన్‌స్క్రీన్‌ను వేడి తగలని చోట నిల్వ చేయడం చాలా ముఖ్యం.
లిప్ కేర్