Brush Stroke

Artist Story

వివాహ జీవితం(Married life) ప్రేమ, నమ్మకం, గౌరవం మీద నిలబడుతుంది. ఈ మూడు స్థంభాలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే సంబంధం స్థిరంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోవడం ఈ బంధానికి నష్టం కలిగిస్తుంది .

పిల్లల పెంపకం తల్లిదండ్రులుగా పిల్లల పెంపకంలో అభిప్రాయ భేదాలు సహజం. కానీ భాగస్వామి నిర్ణయాలను ఇతరుల ముందు విమర్శించడం, చిన్న చూపు చూపడం తప్పు. ఇది కుటుంబంలో గౌరవాన్ని తగ్గిస్తుంది.

Brush Stroke

వ్యక్తిగత సంభాషణ   భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలు చాలా ప్రైవేట్. వాటిని బంధువులు (Family) లేదా స్నేహితులతో (Freinds) చర్చించడం సరిగ్గా కాదు. ఇలా చేయడం వల్ల మూడో వ్యక్తి మీ మధ్య ఉన్న బంధాన్ని తక్కువ చేసి చూడవచ్చు.

Brush Stroke

గొడవలను బయటకు తీసుకురావద్దు ప్రతి జంట మధ్య చిన్నపాటి వాదనలు సహజం. కానీ వాటిని బయట చెబితే, ఇతరులు మధ్యవర్తులుగా మారి మీ జీవితంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యలను మీరే చర్చించి పరిష్కరించుకోవడం ఉత్తమం.

ఆర్థిక విషయాలలో గోప్యం   డబ్బు సంబంధమైన విషయాలు చాలా సున్నితమైనవి. వీటిని ఇతరులతో పంచుకోవడం వల్ల అపార్థాలు వస్తాయి. భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

Brush Stroke

నో కంపారిజన్  మీ జీవిత భాగస్వామిని ఎవరితోనూ పోల్చకండి. ప్రతి వ్యక్తికి తమదైన స్వభావం, విలువలు ఉంటాయి. పోలికలు ప్రేమను తగ్గిస్తాయి, దూరం పెంచుతాయి.  

Brush Stroke

గౌరవం, ప్రైవసీ ఒకరిపై ఒకరు గౌరవం, నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే సంబంధం దీర్ఘకాలం నిలుస్తుంది. కొన్ని విషయాలు మీ ఇద్దరి మధ్యే ఉండాలి. అదే నిజమైన ప్రేమకు చిహ్నం.