రెజీనా కెసాండ్రా టాలీవుడ్ లో అమ్మడి గురించి, తన అందం గురించి అందరికీ తెలిసిందే.
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్నప్పటికీ రెజీనాకు కోరుకున్న స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు.
దాదాపు టైర్2 హీరోలందరితో కలిసి యాక్ట్ చేసినప్పటికీ అవేవీ రెజీనాను స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి.
రెజీనా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది కానీ ఇప్పటికీ అమ్మడు స్టార్ హీరోయిన్ అవాలని కలలు కంటూనే ఉంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న రెజీనా రీసెంట్ గానే తన పుట్టిన రోజును విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది.