జపాన్‌లోని ఇచికావా జూలో పుట్టిన ఈ బుజ్జి కోతి పేరు 'పంచ్' . ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో ఎక్కడ చూసినా ఈ కోతి పిల్ల వీడియోలే కనిపిస్తున్నాయి.
పాపం, పుట్టిన కొద్ది రోజులకే పంచ్‌ను వాళ్ల అమ్మ వదిలేసింది. ఒంటరిగా ఉన్న ఆ పిల్ల కోతి పడుతున్న బాధ చూసి జూ అధికారులు మనసు చలించిపోయింది.
అమ్మ లేని లోటు తెలియకుండా ఉండాలని జూ కీపర్లు పంచ్‌కు ఒక ఆరెంజ్ కలర్ బొమ్మను ఇచ్చారు. ఆ బొమ్మనే తన అమ్మలా భావించడం మొదలుపెట్టింది ఈ బుజ్జి కోతి
తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, చివరకు ఇతర కోతులతో ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ బొమ్మను తన వీపు మీద వేసుకుని మోసుకెళ్తుంది.
మిగతా కోతుల దగ్గరకు వెళ్లాలని పంచ్ ప్రయత్నిస్తే, అవి దీన్ని కొట్టడం, నెట్టేయడం చేస్తున్నాయి. అప్పుడు భయపడిపోయి పరుగెత్తుకుంటూ వెళ్లి తన టెడ్డీ బేర్‌ను హత్తుకుని సేదతీరుతుంది.
దీని కథ తెలిసిన నెటిజన్లు #HangInTherePunch అంటూ సపోర్ట్ చేస్తున్నారు. చివరకు ప్రముఖులు (ట్రిస్టన్ టేట్ వంటి వారు) కూడా దీన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
తాజాగా వచ్చిన వీడియోలలో ఒక పెద్ద కోతి పంచ్‌ను దగ్గరకు తీసుకుని హత్తుకుంది. మెల్లమెల్లగా పంచ్ తన గ్రూపులో కలిసిపోతుందని జూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మళ్ళీ పెరుగుతున్న బంగారం & వెండి ధరలు
ఫిబ్రవరి 21, 2026 శనివారం రాశిఫలాలు