ఇప్పటి వేగవంతమైన లైఫ్స్టైల్లో చాలా మంది మహిళలు ఉద్యోగం, ఇంటి పనుల్లో నిమగ్నం అవుతూ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోలేకపోతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, అలసట, ఎముకల బలహీనత వంటి సమస్యలు దీనివల్లే వస్తున్నాయని హెల్త్ నిపుణులు (Health Experts) చెబుతున్నారు.
పవర్ సోర్స్: రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు (Pumpkin Seeds) తీసుకోవడం మహిళలకు అద్భుతమైన ఆరోగ్య మద్దతు ఇస్తుంది. ఇవి శరీరానికి అవసరమైన మెగ్నీషియం (Magnesium) , జింక్ (Zinc) , ఐరన్ (Iron) వంటి ఖనిజాలు సమృద్ధిగా అందిస్తాయి. ఇవి శరీర పనితీరును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
హార్మోన్ల సమతుల్యం: మహిళల్లో తరచుగా కనిపించే హార్మోన్ సమస్యలు (Hormone problems) నెలసరి లోపాలు, మెనోపాజ్ (Menopause) ఇబ్బందులకు దారి తీస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు హార్మోన్లను సున్నితంగా స్థిరపరుస్తాయి. అలాగే జింక్ శరీరంలో ఈస్ట్రోజెన్ (Estrogen) , ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.
ఎముకల బలానికి: మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత తగ్గడం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకలకు బలం చేకూరుస్తాయి. పరిశోధనలు కూడా వీటిని ఎముకల ఆరోగ్యానికి ఉత్తమంగా సూచిస్తున్నాయి.
గుండె ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో ఉన్న మంచి కొవ్వులు (Healthy Fats) గుండెకు మేలు చేస్తాయి. ఫైబర్(Fiber ) ,మెగ్నీషియం కలిసి రక్తపోటును నియంత్రిస్తాయి. ఇవి చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచటానికి సహాయపడుతూ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మెరుగైన ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. సెరోటోనిన్ తయారీలో ఇది ఉపయోగపడుతూ మనసుకు శాంతినిస్తూ మంచి నిద్ర అందిస్తుంది. జింక్, మెగ్నీషియం నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి