గుడ్లు మాత్రమే కాదు! ఈ ఫుడ్స్‌లో కూడా భారీగా ప్రోటీన్

6th April 2026

White Scribbled Underline

ప్రోటీన్ శరీర నిర్మాణం, కండరాల అభివృద్ధి మరియు మొత్తం ఆరోగ్యానికి అత్యంత కీలకం. శరీరానికి తగినంత మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ తగ్గుతుంది.

సాధారణంగా ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు. అయితే, వివిధ ఆహార పదార్థాల్లో అధిక స్థాయిలో ప్రోటీన్ లభించడం గమనార్హం.

గుమ్మడికాయ గింజలు పరిమాణంలో చిన్నవైనా పోషకాల్లో గొప్పవి. 100 గ్రాములకు సుమారు 30 గ్రాముల ప్రోటీన్‌తో పాటు జింక్, మాగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి.

పప్పులు సమతుల ఆహారంలో ముఖ్యమైన భాగం. వండిన 100 గ్రాముల పప్పులో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ లభించడం వల్ల ఇవి శాకాహారులకు మంచి ఎంపికగా నిలుస్తాయి.

వేరుశెనగలు ప్రోటీన్ సమృద్ధిగా కలిగిన ఆహారంగా ప్రసిద్ధి. 100 గ్రాముల్లో 25–26 గ్రాముల వరకు ప్రోటీన్ ఉండడం వల్ల ఇవి ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడతాయి.

గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్‌తో పాటు ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడి,గట్ హెల్త్‌కు మేలు చేస్తాయి.

సెనగలు అధిక పోషక విలువలతో కూడిన ఆహారం. వీటిలో ప్రోటీన్‌తో పాటు ఐరన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.

ఈ ఆహారాలను రోజువారీ డైట్లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను సులభంగా పొందవచ్చు. సమతుల ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయి.