వడదెబ్బ లక్షణాలు ..వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

5th March 2026

White Scribbled Underline

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల హీట్‌వేవ్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల శరీరం త్వరగా అలసటకు గురవుతుంది.

హీట్‌వేవ్ వచ్చినప్పుడు తీవ్రమైన దాహం, తలనొప్పి, బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరికి చెమటలు ఎక్కువగా పడటం లేదా శరీరం వేడెక్కిపోవడం కూడా జరుగుతుంది.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. శరీరానికి చల్లదనం ఇవ్వడానికి నీరు లేదా మజ్జిగ వంటి ద్రవాలు తాగడం మంచిది.

ఎండ ఎక్కువగా ఉంది కదా అని ఎటువంటి సమయంలో కూల్ డ్రింక్స్ తీసుకోవడం చాలా ప్రమాదకరం. వీలైనంతవరకు సహజపానీయాలని తీసుకోవాలి.

వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగితే తడి గుడ్డతో ముఖం, మెడ, చేతులను మెల్లగా తుడవాలి. ఇలా చేయడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది.

హీట్‌వేవ్ సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తేలికపాటి దుస్తులు ధరించడం అవసరం. తలపై టోపీ లేదా గుడ్డ పెట్టుకోవడం కూడా రక్షణ ఇస్తుంది.

వడదెబ్బ తీవ్రంగా తగిలితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించడం చాలా అవసరం. చిన్నపిల్లలకు, పెద్దవారికి ఈ సమయంలో ఓఆర్ఎస్ వంటి ద్రవాలు ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది.

వడగాలులు వీస్తూ, ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో ఎక్కువసేపు బయట ఉండకూడదు. శరీరానికి అవసరమైనంత నీరు తీసుకుంటే హీట్‌వేవ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.