వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా హైపర్టెన్షన్ , డయాబెటిస్ వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే క్రానిక్ వ్యాధులు.
హైపర్టెన్షన్ అంటే రక్తపోటు ఎక్కువగా ఉండడం. ఇది గుండె, మెదడు ,కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
డయాబెటిస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇది నియంత్రణలో లేకపోతే నరాలు, కళ్ళు, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.
ఈ రెండు వ్యాధులు చాలా సార్లు స్పష్టమైన లక్షణాలు లేకుండా ఉంటాయి. అందుకే వృద్ధులు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
సమతుల్యమైన ఆహారం, తక్కువ ఉప్పు , చక్కెరతో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ప్రతిరోజూ కొద్దిసేపు నడక కూడా చాలా ఉపయోగకరం.
డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం తో పాటు ఒత్తిడిని తగ్గించే అలవాట్లు పెంచుకోవాలి.
సరైన జీవనశైలి పాటిస్తే ఈ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండటం వృద్ధాప్యంలో మంచి జీవన నాణ్యతను ఇస్తుంది.