చలికాలం (Winter Season) లేదా వర్షాకాలం (Rainy Season) వచ్చిందంటే చర్మం డ్రైగా మారుతుంది. ఈ సమయంలో పెట్రోలియం జెల్లీ (Petroleum Jelly) వాడటం చాలా ఉపయోగకరం. ఇది చర్మానికి మృదుత్వం ఇచ్చి, పగుళ్లను తగ్గిస్తుంది.
ఇంట్లో తయారు చేసుకోవచ్చు బయట దొరికే పెట్రోలియం జెల్లీకి బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. కొద్దిపాటి పదార్థాలతో రసాయనాల్లేని నేచురల్ జెల్లీ తయారవుతుంది.
కావలసిన పదార్థాలు వర్జిన్ కొబ్బరినూనె (Virgin Coconut Oil) – 1 కప్పు ఆలివ్ ఆయిల్ (Olive Oil) – 1 కప్పు బీస్‌వ్యాక్స్ (Bees Wax) – 2 టేబుల్ స్పూన్లు టీట్రీ ఆయిల్ (Tea Tree Essential Oil) – 10 చుక్కలు
తయారీ విధానం ఓ గాజు బౌల్‌ని నీటిలో ఉంచి డబుల్ బాయిలర్ పద్ధతిలో వేడిచేయండి. కొబ్బరినూనె, బీస్‌వ్యాక్స్ వేసి కరిగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, టీట్రీ ఆయిల్ వేసి బాగా కలపాలి. క్రీమీగా అయ్యాక గాజు కంటెయినర్‌లో వేసి చల్లారనివ్వండి. మూడు గంటల్లో గట్టిపడుతుంది.
వాడే విధానం ఈ జెల్లీని పగిలిన పెదాలపై, పాదాల పగుళ్లపై, డ్రై స్కిన్‌పై రాయండి. ఇది స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేసి, హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే చిన్న గాయాలు, కాలిన గాయాలపై కూడా రాయొచ్చు.
అదనపు ఉపయోగాలు ఇది మేకప్ రిమూవర్‌గా ఉపయోగపడుతుంది. జుట్టు చిట్లిపోవడం చేసి డ్రైనెస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. పిల్లల్లో డైపర్ రాషెస్ తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఈ సహజ పెట్రోలియం జెల్లీని ఇంట్లో తయారు చేసుకోవడం సులభమే కాకుండా, కెమికల్స్ లేని సురక్షిత పరిష్కారమూ అవుతుంది. కాబటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.