6th May 2026

____________

- Saidulu

ట్రెడిషనల్ టచ్ తో మోడరన్ లుక్ ఇచ్చే పంచలోహ బుట్ట కమ్మలు..

పంచలోహ బుట్ట కమ్మలు సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఆభరణాలు. ఐదు లోహాల మిశ్రమంతో తయారయ్యే వీటి ప్రత్యేకత అందం, ఆధ్యాత్మికత రెండింటిలోనూ కనిపిస్తుంది.

పండుగలు, శుభకార్యాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి మంచి ట్రెడిషనల్ టచ్ తో ఏ ఫంక్షన్ కైనా బాగా సెట్ అవుతాయి.

పంచలోహం అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం వంటి లోహాల కలయిక. ఈ మిశ్రమం శక్తి సమతుల్యతను కలిగిస్తుందని నమ్మకం ఉంది.

 ఈ కమ్మలు సంప్రదాయ డిజైన్‌తో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇవి గ్రామీణ శైలి అందాన్ని ప్రతిబింబిస్తాయి.

ఈ కమ్మలు ధరించడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని కొందరు విశ్వసిస్తారు. ఆధ్యాత్మికంగా కూడా మంచి ప్రభావం ఉంటుందని చెబుతారు.

పండుగలు, పెళ్లిళ్లు, జాతరల సమయంలో ఈ కమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంప్రదాయ దుస్తులతో బాగా సరిపోతాయి.

పంచలోహ కమ్మలు బలంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. సరైన సంరక్షణతో మరింత కాలం మెరుగైన మెరుపుతో ఉంటాయి.

ఈ కమ్మలను శుభ్రంగా ఉంచడానికి మృదువైన గుడ్డతో తుడవడం మంచిది. రసాయన పదార్థాలు వాడకుండా జాగ్రత్త పడాలి.