నేటి వేగమైన జీవనశైలిలో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. పసుపు (Turmeric) , అల్లం (Ginger) , బీట్‌రూట్ (Beetroot) , ఆమ్లా (Amla) తో తయారుచేసే హెల్త్ షాట్స్  (Health shots) శరీరానికి సహజ శక్తినిచ్చే చిన్న పానీయాలు. వీటిని అనేక ఫిట్‌నెస్ నిపుణులు, డైటీషియన్లు సూచిస్తున్నారు.

పసుపు షాట్ ప్రయోజనాలు: పసుపు లో ఉండే కుర్కుమిన్ (Curecmin) శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపులో ఇది ఎంతో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, శరీర నొప్పులు వస్తే ఈ షాట్ బాగా పనిచేస్తుంది.

Cutout

అల్లం షాట్ శరీర శుద్ధికి: అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదర సమస్యలు, గ్యాస్ , వాంతుల వంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం షాట్ తీసుకుంటే శరీరం తాజాగా ఉంటుంది.

బీట్‌రూట్ షాట్ రక్తానికి బలం: బీట్‌రూట్ లో ఉన్న నైట్రేట్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. హీమోగ్లోబిన్ పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఎక్కువగా బలహీనత, అలసటగా అనిపించే వారికి ఇది మంచి నేచురల్ ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది.

Curved Arrow

ఆమ్లా షాట్ విటమిన్–సి పవర్: ఆమ్లా విటమిన్–సితో (Vitamin C) నిండివుంటుంది. ఇమ్యూనిటీ పెరిగి జుట్టు రాలడం తగ్గుతుంది. స్కిన్ గ్లో కూడా మెరుగు పడుతుంది. ఆమ్లా షాట్ రోజూ తీసుకుంటే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.

ఈ షాట్స్ ఎలా తీసుకోవాలి: పసుపు–అల్లం–బీట్‌రూట్–ఆమ్లా జ్యూస్‌లను విడిగా లేదా కలిసి తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది. కెమికల్స్ లేకుండా ఇంట్లో తాజా పదార్థాలతో తయారుచేయడం ఉత్తమం.