1

ఇంట్లో లేదా ఇంటి ముందుభాగంలో మనీ ప్లాంట్ (Money Plant) ఉండటం శుభం అని చాలా మంది నమ్ముతారు. ఇది పచ్చగా, తీగలుగా పెరిగి ఇల్లంతా ఆహ్లాదకరంగా కనిపించేటట్లు చేస్తుంది. ఇంటి వాతావరణాన్ని కూడా చల్లగా ఉంచుతుంది.

సహజ ఎరువుల ఉపయోగం మనీ ప్లాంట్ చక్కగా పెరగాలంటే సహజ ఎరువులు ఉపయోగించడం మంచిది. పాలకూర (Spinach), అరటి తొక్కలు (Banana Peels) చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో 24 గంటలు నానబెట్టి, ఆ నీటిని వడకట్టి మొక్కలపై స్ప్రే చేయండి. ఇందులో నైట్రోజన్, ఐరన్, పొటాషియం, పాస్ఫరస్ లాంటి పోషకాలు ఉంటాయి.

మట్టి ఎంపిక మనీ ప్లాంట్ పెరిగేందుకు గట్టి మట్టి కాకుండా మెత్తని మిశ్రమం కావాలి. కోకోపీట్ (Cocopeat)‌తో పాటు వర్మికులైట్‌ (Vermiculite) కలిపితే వేర్లకు గాలి తగిలి నీరు సరిగా వెలుపలికి వెళ్తుంది. కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ కలిపితే మరింత మంచి ఫలితం వస్తుంది.

నీటి పరిమాణం మనీ ప్లాంట్‌కి నీరు తగిన మోతాదులో మాత్రమే ఇవ్వాలి. ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్లిపోతాయి. ఎండాకాలంలో మాత్రమే కొంచెం ఎక్కువ నీరు ఇవ్వడం మంచిది. చలికాలం లేదా వర్షకాలంలో నీరు తగ్గించండి.

సరైన కుండీ ఎంపిక ఇంటి లోపల పెంచాలనుకుంటే కనీసం 8 అంగుళాల పరిమాణం ఉన్న కుండీ (Pot) వాడాలి. ఎక్కువగా పెరిగే తీగల కోసం పెద్ద కుండీ ఎంచుకుంటే చెట్టు బలంగా పెరుగుతుంది.

గ్లాస్ వేస్ కుండీలో కాకుండా నేరుగా వాటర్ లో పెంచాలి అనుకుంటే తగిన గ్లాస్ వేస్ ఎంచుకోవాలి. మనం తీసుకునే క్లాస్ ఫేర్ రెగ్యులర్ గా క్లీన్ చేసుకునే దానికి వీలుగా ఉండాలి .వారానికి రెండు సార్లు ఇందులో నీటిని మారుస్తూ ఉండాలి.

రెగ్యులర్ కేర్‌తో ప్రతి వారానికి ఒకసారి నీటిలో కరిగే ఎరువులు వేయడం, సూర్యకాంతి తగినంతగా అందించడం వల్ల మనీ ప్లాంట్ గుబురుగా, పచ్చగా పెరుగుతుంది. ఇలా సరైన సంరక్షణతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.