ఇంట్లో మిక్సీ బ్లేడ్లు (Mixy blades) మొద్దుబారితే వెంటనే రిపేర్ షాపుకే వెళ్లాల్సిన అవసరం లేదు. సులభంగా దొరికే కొన్ని పదార్థాలతోనే వాటికి తిరిగి పదును పెట్టుకోవచ్చు. ఖరీదు లేకుండా, శ్రమ లేకుండా పనిచేసే ఈ పద్ధతులు చాలా మంది ఫుడ్ క్రియేటర్లు (Food Creators) , హోమ్ టిప్స్ (Home tips) నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు చూడండి.

కల్లు ఉప్పు (Rock Salt) గట్టిగా ఉండే కారణంగా బ్లేడ్‌లపై ఉండే తుప్పు, మసక దుమ్ములను తొలగిస్తుంది. అర కప్పు కల్లు ఉప్పు జార్‌లో వేసి, 30–40 సెకన్లు మిక్సీని నడిపితే బ్లేడ్ అంచులు శుభ్రపడడమే కాకుండా కొత్త వాటిలా చాలా పదునుగా మారుతాయి.

మిక్సర్ ఎక్కువసేపు పనిచేసినప్పుడు బ్లేడ్ వేడెక్కి మొద్దుబారుతుంది. ఐస్ క్యూబ్స్‌ (Ice Cubes) జార్‌లో వేసి కొద్దిసేపు గ్రైండ్ చేస్తే బ్లేడ్ మళ్లీ గట్టిపడి పదును కలిగి ఉంటుంది. ఇది అంచులను సున్నితంగా పాలిష్ చేసే విధంగా పనిచేస్తుంది.

గుడ్డు పెంకులు: ఎండబెట్టిన గుడ్డు పెంకులు (Egg Shells) బ్లేడ్‌పై ఉండే తుప్పు, మసక మచ్చలను తొలగించడంలో బాగా పని చేస్తాయి. పెంకులను జార్‌లో వేసి పొడి అయ్యే వరకు గ్రైండ్ చేస్తే మిక్సీకి మంచి పదును వస్తుంది.

అల్యూమినియం ఫాయిల్: అల్యూమినియం ఫాయిల్‌ (Aluminium Foil) చిన్న ముక్కలుగా కట్ చేసి జార్‌లో వేసి 30 సెకన్లు గ్రైండ్ చేస్తే బ్లేడ్ అంచులు చాలా షార్ప్ గా అవుతాయి. ఇది తక్కువ సమయంలో మంచి ఫలితమిచ్చే పద్ధతి.

న్యూస్‌పేపర్‌: న్యూస్ పేపర్ ముక్కలు (Newspaper Pieces) కొద్దిగా నీటితో కలిపి రెండు మూడు సార్లు గ్రైండ్ చేస్తే బ్లేడ్‌పై ఉన్న దుమ్ము, తుప్పు వదిలి పదును పెరుగుతుంది.

ఈ ట్రిక్స్ ప్రయత్నించే ముందు జార్ శుభంగా ఉందో లేదో చూసుకోవాలి. ప్రతి ఉపయోగం తర్వాత జార్ ను నీట్ గా కడిగి బ్లేడ్‌లను డ్రై చేసుకోవడం వాటి ఆయుష్షును పెంచుతుంది. ఈ సులభమైన పద్ధతులతో మిక్సీ మళ్లీ కొత్తదిలా పనిచేస్తుంది.