సౌత్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాధవన్ సినిమాల్లోకి రాకముందు టీచర్ గా వర్క్ చేశారు.
కొల్హాపూర్ లో స్టూడెంట్స్ కు స్కిల్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడే మాధవన్, తన భార్య సరితా బిర్జేని కలిశారు.
ఎయిర్ హోస్టెస్ కావాలనే కోరికతో స్కిల్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ కోసం సరిత మాధవన్ ను కలిసి, తర్వాత ఎయిర్‌హోస్టెస్ అయింది.
సెలెక్ట్ అవుతానో లేదో అనుకున్న తాను, ట్రైనింగ్ వల్లే సెలెక్ట్ అయ్యానని భావించి తన సర్ ను ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించింది.
మాధవన్ కు కూడా ఆమెపై ఆసక్తి ఉండటంతో వెళ్లారు. అలా మొదలైన సంబంధం, 1991లో పెళ్లిగా మారింది.
మాధవన్, సరితకు వేదాంత్ అనే కొడుకు ఉన్నాడు.
పెళ్లి తర్వాత కూడా సరిత మాధవన్‌కు పెద్ద బలంగా నిలిచారు.
మాధవన్ మోడలింగ్ నుంచి సినిమాల వైపు అడుగులు వేసినప్పుడు, కుటుంబాన్ని ముందుగా ఉంచుకుంటూనే కెరీర్‌ను నిర్మించారు.
Sugar Control: షుగర్ పేషెంట్లు ఉదయం .....
చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు ........