ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇప్పుడు చాలామంది చైనీస్ మనీ ప్లాంట్ పెంచడానికి ఇష్టపడుతున్నారు.
సాధారణ మనీ ప్లాంట్‌కు భిన్నంగా చైనీస్ మనీ ప్లాంట్ ఆకులు నాణేల మాదిరిగా ఉంటాయి. దీనిని లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇంట్లో ఉంటే శుభమని నమ్మకం.
ఈ మొక్కకు ఎక్కువ నీరు అవసరం లేదు. మట్టి పూర్తిగా ఎండినప్పుడు మాత్రమే నీరు పోస్తే సరిపోతుంది. అతిగా నీరు పోయడం వల్ల వేర్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఈ మొక్కకు సరైన వెలుతురు చాలా ముఖ్యం. నేరుగా ఎండ కాకుండా పరోక్షంగా సూర్యకాంతి పడే చోట ఉంచాలి. ఇండోర్ ప్లాంట్ పెంచాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
వదులుగా ఉండే ఆర్గానిక్ మట్టి లేదా కోకో పిట్ ఉపయోగిస్తే మొక్క బాగా పెరుగుతుంది. వీటిని పెంచడానికి చిన్న కుండీలు బాగుంటాయి.
చైనీస్ మనీ ప్లాంట్ ఇంటి అలంకరణకే కాదు, గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కూడా చాలా బాగుంటుంది.