మనలో చాలామందికి మార్నింగ్ వాక్ చేయాలంటే కాస్త బద్ధకంగా ఉంటుంది. పొద్దునే ఎందుకు నడవాలి ఎప్పుడైనా నడవొచ్చు కదా అని భావిస్తారు.. కానీ పొద్దు న వాకింగ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ తెలిస్తే మీరు మార్నింగ్ అస్సలు నెగ్లెక్ట్ చేయరు..

నిద్రలేచిన తర్వాత చేసే వాకింగ్ వల్ల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆరోజు యాక్టివిటీకి కావాల్సిన శక్తి కూడా సమకూర్తుంది.ఉదయం నడక శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం బలపడుతుంది.

మొదటి వారం 10 నిమిషాల నుంచి మొదలుపెట్టి, క్రమంగా 30 నిమిషాలకు పెంచుకోవాలి. ఆ తర్వాత మీ కెపాసిటీని బట్టి రోజుకు గంట వరకు వాకింగ్ సులభంగా చేయవచ్చు.

చేతులు, కాళ్ల కదలికలతో ఎముకలకు బలం పెరుగుతుంది. తరచూ బాడీ పెయింట్స్ తో బాధపడే వారికి రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది.

తాజా గాలి, ప్రశాంత వాతావరణం మూడ్‌ను మెరుగుపరుస్తాయి. ఉదయం నడక మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దీంతో ఆ రోజు మొత్తం మనం చాలా ఉల్లాసంగా ఉంటాము.

రోజూ 30 నిమిషాలు నడవడం ద్వారా అదనపు కొవ్వు తగ్గుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. పైగా పొద్దున ఖాళీ కడుపుతో నడుస్తాం కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

మార్నింగ్ వాక్ మనలోని స్ట్రెస్ లెవెల్స్ తగ్గించి హెల్తీ హార్మోన్స్ పెంచుతుంది. దీంతో మనకు రోజంతా ఎంత ఉల్లాసంగా కడుస్తుంది కాబట్టి రాత్రి పూట మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది.