జో శర్మ అమెరికన్ డెలిగేట్‌గా IFFI GOAకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నటనపై ఉన్న మక్కువతో ఆమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
M4M - Motive for Murder అనే సీరియల్ కిల్లర్ కథలో జో శర్మ ప్రధాన పాత్ర పోషించగా, ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు టీజర్లు రిలీజయ్యాయి.
మోహన్ వడ్లపాట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులను గెలుచుకుంది.
జో శర్మ కూడా ఈ మూవీకి న్యూ యార్క్ మూవీ అవార్డ్స్, డబ్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డులు కూడా అందుకుంది.
జో శర్మను అధికారికంగా అమెరికన్ డెలిగేట్‌గా గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కు ఆహ్వనించారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణతో పాటు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆమెకు సన్మానం జరిగింది.