29th April 2026

____________

- Saidulu

ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి, శాంతిని ఇచ్చే వస్తువులు..!

మూలల్లో కల్లు ఉప్పు ఉంచితే గాలిలోని ప్రతికూలత పోతుంది. ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేస్తే నెగటివ్ వైబ్రేషన్స్ వెంటనే తొలగిపోతాయి.

కల్లు ఉప్పు (Sea Salt)

ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో దైవిక శక్తి పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య కలహాలను తగ్గిస్తుంది.

దీపారాధన

ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు, ప్రతికూల శక్తి నశిస్తాయని పెద్దల నమ్మకం. ఇల్లు ప్రశాంతంగా మారుతుంది.

కర్పూరం (Camphor)

తులసికి గాలిని శుద్ధి చేసే శక్తి ఉంది. ఇంటి ఈశాన్య దిశలో తులసిని ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమై, శుభం కలుగుతుంది.

తులసి మొక్క (Tulsi Plant)

అమెథిస్ట్, బ్లాక్ టూర్మలైన్ వంటి స్ఫటికాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి ఇంట్లోని చెడు ప్రభావాన్ని పీల్చుకుని మనల్ని కాపాడతాయి.

స్ఫటికాలు (Crystals)

ఈశాన్య మూలలో నీటి పాత్ర లేదా ఫౌంటెన్ ఉంచండి. ప్రవహించే నీరు సానుకూల శక్తిని పెంచి, ఇంటి వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.

నీటి పాత్రలు (Water Bowls)

సుగంధ భరితమైన అగరబత్తీలు వెలిగించడం వల్ల పరిసరాలు శుద్ధి అవుతాయి. మంచి వాసన మనసులోని ఒత్తిడిని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.

అగరబత్తీలు (Incense Sticks)

పగిలిన వస్తువులు, చెత్తను వెంటనే తొలగించాలి. ఇల్లు వెలుతురుతో, శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం, సానుకూలత లభిస్తాయి.

శుభ్రత (Cleanliness)

మనీ ప్లాంట్, బాంబూ వంటివి గాలిని శుభ్రపరుస్తాయి. ఇవి ఇంట్లోని ప్రతికూలతను శోషించుకుని ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి

ఇండోర్ ప్లాంట్స్ (Indoor Plants)