విటమిన్ డి మన రోజువారీ జీవితానికి చాలా కీలకం, ఇది ఎముకలు బలంగా ఉండేందుకు కండరాలు సరిగ్గా పనిచేయేందుకు శరీరానికి శక్తి అందేందుకు సహాయపడుతుంది.

విటమిన్ డి ఇమ్యూనిటీని పెంచుతుంది, తరచూ జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

సహజంగా విటమిన్ డి పొందాలంటే ఉదయం సూర్యకాంతిలో 15 నుంచి 20 నిమిషాలు ఉండటం ఉత్తమం, అలాగే పాలు గుడ్లు చేపలు మష్రూమ్స్ వంటి ఆహారాలు ఉపయోగపడతాయి.

విటమిన్ డి సరిపడా ఉంటే ఎముకల నొప్పులు తగ్గుతాయి, దంతాలు బలంగా ఉంటాయి వయస్సు పెరిగినా చురుకుదనం కొనసాగుతుంది.

విటమిన్ డి తగ్గితే అలసట ఎముకల నొప్పులు కండరాల బలహీనత జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

రోజూ ఉదయం కొద్దిసేపు ఎండ తగిలేలా ఉండటం, మంచి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా విటమిన్ డి స్థాయిని మెయింటైన్ చేయవచ్చు.