ఎన్ని కొత్త హెయిర్‌స్టైల్‌లు, కలర్స్ వచ్చినా నల్లజుట్టుకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. నల్లగా ఉన్న జుట్టు యంగ్‌గా, అందంగా ఉండటాానికి యూజ్ అవుతుంది. అందుకే చాలా మంది రకరకాల హెయిర్ కలర్స్ వాడినా చివరికి నల్లజుట్టునే ఇష్టపడతారు.
తెల్లజుట్టు సమస్య పెరుగుతోంది ఈ రోజుల్లో ఒత్తిడి, పొల్యూషన్, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తోంది. 20 ఏళ్ల వయసులోనే చాలా మంది తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారు. కెమికల్ డైలు వాడటం వల్ల సమస్య మరింత పెరుగుతోంది.
కెమికల్ డైలకు నో చెప్పండి సాధారణంగా మార్కెట్లో దొరికే డైలు తాత్కాలికంగా జుట్టు రంగు మార్చినప్పటికీ, అందులోని కెమికల్స్ జుట్టుని బలహీనంగా చేసి, కుదుల నుంచి బలహీనంగా చేస్తాయి. దీని బదులు సహజ పదార్థాలతో తయారు చేసే నేచురల్ డై వాడటం సురక్షితం.
ఇంటి చిట్కాతో నల్లజుట్టు: ఇంట్లోనే ఉన్న పదార్థాలతో జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. కాఫీ గింజలు, కలోంజి సీడ్స్, బ్లాక్ సీడ్ ఆయిల్ కలిపి తయారు చేసే పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని జుట్టుకు బాగా రాసి కొంతసేపు ఉంచి ఆ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ తో వాష్ చేస్తే జుట్టుకి సహజమైన నల్లని మెరుపు వస్తుంది.
ఈ మిశ్రమం ప్రయోజనాలు: కాఫీ గింజల్లో సహజమైన బ్లాక్ టోన్ ఉంటుంది. కలోంజి సీడ్స్ (Kalonji Seeds) యాంటీ ఆక్సిడెంట్స్‌తో జుట్టును బలపరుస్తాయి. బ్లాక్ సీడ్ ఆయిల్ (Black Seed Oil) కుదుళ్లకు పోషణ ఇస్తుంది. ఈ మూడు కలయిక జుట్టును నల్లగా, మెత్తగా చేస్తుంది.
రెగ్యులర్‌గా వాడితే ఫలితం ఖాయం: ఈ నేచురల్ డైని రెగ్యులర్‌గా వాడితే జుట్టు నల్లగా మారడమే కాకుండా బలంగా, మెరిసేలా మారుతుంది. కెమికల్ ప్రాబ్లమ్స్ లేకుండా అందమైన నల్లజుట్టు కావాలంటే ఇదే సరైన పరిష్కారం.