ఇంట్లోనే కూరగాయలు పెంచడం ఆరోగ్యకరమైన అలవాటు. వాటిలో మెంతి ఆకులు (Methi Leaves) పెంచడం చాలా సులభం. చిన్న స్థలం ఉన్నా సరిపోతుంది. టెర్రస్, బాల్కనీ లేదా కిచెన్ దగ్గర ఉన్న స్థలంలో ఇవి సులభంగా పెరుగుతాయి. కుండీల్లో కూడా వీటిని పెంచుకోవడం చాలా సులభం.

విత్తనాల ఎంపిక: మంచి నాణ్యత గల మెంతి విత్తనాలు ఎంచుకోవాలి. సేంద్రియ మట్టీ (Organic Soil) లేదా ఎరువులతో కలిపిన మట్టీ ఉపయోగించాలి. మట్టీ తడి ఉండేలా చూసుకోవాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు.

విత్తనాలు వేసే విధానం: పొడి మట్టీపై విత్తనాలు చల్లి, పలుచని పొరతో కప్పాలి. రెండు రోజుల్లో మొలకలు (Sprouts) వస్తాయి. రోజుకు ఒకసారి నీరు చల్లడం సరిపోతుంది. నేరుగా ఎండ ఎక్కువగా పడకుండా రక్షించాలి. మొలకలు వచ్చిన తర్వాత విత్తనాలకు అవసరమైన ఎండ పడేలా ఉంచాలి.

పెరుగుదల దశలో సంరక్షణ: మెంతి మొక్కలు వేగంగా పెరుగుతాయి. వీటిని కీటకాల నుండి రక్షించేందుకు నిమ్మరసం లేదా వేప ఆకు కలిపిన నేచురల్ స్ప్రే (Natural Spray) వాడవచ్చు. ఎరువుల స్థానంలో కిచెన్ వ్యర్థాలతో తయారైన కంపోస్ట్ ఉపయోగిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.

పోషణ: విత్తిన 20–25 రోజుల తర్వాత ఆకులు సిద్దమవుతాయి. కత్తెరతో పైభాగం మాత్రమే కత్తిరించాలి. మొక్క మళ్లీ పెరుగుతుంది కాబట్టి ఒకసారి వేసిన మొక్కతో అనేక సార్లు పంట తీసుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు: మెంతి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వంటల్లో చేర్చితే రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికీ ఉపయోగకరం. ఈ విధంగా ఇంట్లో మెంతి పెంచడం వల్ల తాజా ఆకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.