రామ్ హీరోగా, భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్ గా న‌టించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరోహీరోయిన్లు యూఎస్ కూడా వెళ్లి మూవీని అక్క‌డి ఆడియ‌న్స్ తో చూసి మూవీపై హైప్ కూడా పెంచారు. హీరోయిన్ భాగ్య‌శ్రీ ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్న విష‌యం కూడా తెలిసిందే.

అయితే సినిమాకు ఎన్ని ప్ర‌మోష‌న్స్ చేసినా, టాక్ బావున్న‌ప్ప‌టికీ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి అనుకున్న స్థాయి క‌లెక్ష‌న్లు మాత్రం రావ‌డం లేదు. 

దీంతో భాగ్య‌శ్రీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ట్వీట్ చేయ‌గా అది ప్ర‌స్తుతం వైర‌ల‌వుతుంది. ఆంధ్ర కింగ్ తాలూకా విష‌యంలో టాలీవుడ్ ఫెయిలైంది అని అమ్మ‌డు పోస్ట్ చేసింది. 

ఈ మూవీకి మొద‌టి మూడు రోజులు క‌లిపి కూడా రూ.10 కోట్ల షేర్ రాక‌పోవ‌డం విశేషంగా చెప్పుకోవాలి. టాక్ బావున్నా, క‌లెక్ష‌న్లు పెర‌గ‌క‌పోవ‌డంతోనే భాగ్య‌శ్రీ అలా పోస్ట్ చేసి ఉంటుంద‌ని నెటిజ‌న్లు భావిస్తుండ‌గా ప్ర‌స్తుతం ఆ పోస్ట్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.