మీ ఉదయాన్ని ఆరోగ్యంగా ప్రారంభిస్తే రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. ఉత్సాహం పెరుగుతుంది. అలసట, సోమరితనం తగ్గుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఉదయపు అలవాట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

ఉదయం మంచుతో తడిసిన పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడాన్ని సహజ చికిత్సగా భావిస్తారు. దీనివల్ల పాదాలు భూమిని నేరుగా తాకుతాయి.

ఈ అలవాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పాదాల వాపు, అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది.

గడ్డి మీద నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది.

పాదాల ద్వారా శరీర శక్తి సమతుల్యం అవుతుంది. దీని వల్ల కంటి చూపు, ఏకాగ్రత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

సూర్యోదయానికి ముందు లేదా తర్వాత 15 నుంచి 30 నిమిషాలు చెప్పులు లేకుండా నడవాలి. శీతాకాలం, వేసవి రెండింటిలోనూ ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.

రోజూ ఈ చిన్న అలవాటు పాటిస్తే శరీరం సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది. మన రోజువారి జీవనశైలిలో ఎటువంటి చిన్న మార్పులు చేసుకోవడం వల్ల హ్యాపీ గా ఉండొచ్చు.