ప్రతి ఉదయం ఈ వాము–దాల్చిన చెక్క నీటిని తాగడం ఒక మంచి అలవాటు. ఇది శరీరాన్ని డీటాక్స్ (Detox) చేయడమే కాకుండా, బరువు నియంత్రించి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నేచురల్‌గా హెల్దీగా ఉండాలనుకునే వారికి ఇది సులభమైన  సురక్షితమైన మార్గం.

బరువు తగ్గడం అనగానే చాలా మంది మొదట గుర్తు చేసేది డైట్ కంట్రోల్ (Diet ), వర్కౌట్స్ (workouts) . కానీ, ఇవి పాటించినా కొన్నిసార్లు ఫలితం నెమ్మదిగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని ఇంటి చిట్కాలు (Home Remedies) కూడా పాటిస్తే మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. .

"

ఉదయాన్నే తాగాల్సిన వాము–దాల్చిన చెక్క డ్రింక్ ప్రతి రోజు ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటిలో వాము (Carom Seeds), దాల్చిన చెక్క (Cinnamon Stick) వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. 

ఈ డ్రింక్ వల్ల కలిగే లాభాలు – వాము, దాల్చిన చెక్కలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న టాక్సిన్స్ (Toxins)ని బయటకు పంపుతాయి. – మెటబాలిజం (Metabolism) వేగంగా పనిచేయడంతో కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. – రక్తంలో షుగర్ లెవల్స్ (Blood Sugar Levels) సమతుల్యంగా ఉండడంతో ఆకలి తగ్గుతుంది. – ఈ డ్రింక్ తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగవుతుంది, గ్యాస్ లేదా ఉబ్బరం తగ్గుతుంది.