రిలేషన్ ప్రారంభంలో జాగ్రత్త కొత్త రిలేషన్‌షిప్ (Relationship) మొదలైనప్పుడు ప్రతీది కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ మొదట్లో చేసే కొన్ని చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి మొదటి రోజుల నుంచే పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం అవసరం.

The Crew

లవ్ బాంబింగ్‌కి దూరం మొదట్లో ఎక్కువగా గిఫ్ట్స్‌ ఇవ్వడం, పదే పదే కాల్‌ చేయడం, మెసేజెస్‌ పంపడం లాంటివి ప్రేమగా అనిపించినా, ఆ తర్వాత అది ఒత్తిడిగా మారుతుంది. ఎదుటివారికి స్పేస్‌ ఇవ్వడం చాలా ముఖ్యం. అతి ప్రేమకంటే అర్థం చేసుకోవడం బలమైన బంధానికి కారణమవుతుంది.

హద్దులు గౌరవించండి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత పరిమితులు ఉంటాయి — శారీరకంగా, మానసికంగా. వాటిని గౌరవించడం రిలేషన్‌లో నమ్మకాన్ని పెంచుతుంది. ఆ హద్దులు దాటితే ఎదుటివారిలో అసౌకర్యం, ఆగ్రహం వస్తాయి.

అనుమానాలకి స్థానం వద్దు ఎదుటివారు ఎక్కడ ఉన్నారో, ఎవరి తో మాట్లాడుతున్నారో అనే ప్రశ్నలతో నిండిన రిలేషన్‌లో శాంతి ఉండదు. ప్రేమ అనేది నమ్మకంతో నిండాలి కానీ భయంతో కాదు. అతి అనుమానాలు రిలేషన్‌ను దెబ్బతీస్తాయి.

ప్రాధాన్యం కోసం పోటీ వద్దు ప్రేమలో భాగస్వామిని మాత్రమే ముఖ్యంగా చూడాలని బలవంతపెట్టకండి. కుటుంబం, స్నేహితులు కూడా వారి జీవితంలో భాగమే. మీరు మాత్రమే ముఖ్యమని భావించడం రిలేషన్‌లో ఒత్తిడిని తెస్తుంది.

అసూయను నియంత్రించండి జెలసీ (Jealousy) కొద్దిగా ఉంటే సహజం. కానీ అది అధికమైతే సమస్యలకే దారి తీస్తుంది. పార్టనర్‌ ఇతరులతో మాట్లాడితే అసూయ పడకండి. నమ్మకం, గౌరవం ఉన్న చోటే నిజమైన ప్రేమ నిలుస్తుంది.