మనము రోజూ తినే ఆహారం వెంటనే శరీరానికి శక్తిగా మారదు. ఏ ఫుడ్ ఎంత టైమ్ లో డైజెస్ట్ అవుతుందో తెలుసుకుందాం..

పండ్లు, కూరగాయలు శరీరానికి తేలికైన ఆహారం. ఆరెంజ్, ఆపిల్ లాంటి పండ్లు 30 నుంచి 60 నిమిషాల్లో అరుగుతాయి. ఉడికించిన కూరగాయలు 1 - 2 గంటల్లో జీర్ణమవుతాయి.

బియ్యం, రొట్టె, ఇడ్లీ, దోసె వంటి కార్బోహైడ్రేట్ ఫుడ్స్ 2 నుంచి 3 గంటల్లో అరుగుతాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కానీ అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

పప్పులు, శనగలు, రాజ్మా లాంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం అరగడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఇవి కడుపు నిండుగా ఉంచి ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తాయి.

పాలు, పెరుగు, చీజ్ వంటి డెయిరీ ఫుడ్స్ జీర్ణం కావడానికి 2 నుంచి 3 గంటలు పడుతుంది. చేపలు, చికెన్ లాంటి మాంసాహారం జీర్ణం అవడానికి 3 నుంచి 5 గంటల వరకు సమయం అవసరం.

ఆహారం బాగా డైజెస్ట్ కావాలి అంటే నిదానంగా తినాలి. తిన్న వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడవడం మంచిది. ఇలా తేలికపాటి మార్పులతో వైట్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది.