చిన్నారుల బుజ్జి బుగ్గలు చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించడం సహజం. కానీ అదే ప్రేమ పసిబిడ్డల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

పిల్లలను ముద్దు పెట్టుకునే సమయంలో మన నోటిలోని లాలాజలం ద్వారా అనేక రకాల క్రిములు వారి శరీరంలోకి చేరుతాయి. పెద్దలకు సాధారణంగా అనిపించే జలుబు, దగ్గు వంటి సమస్యలు పసివారిలో జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు కలిగించవచ్చు.  

లాలాజలం ద్వారా ముఖ్యంగా కొన్ని వైరస్‌లు పిల్లలకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే పసిపిల్లలను ముద్దు పెట్టుకోవడాన్ని నిపుణులు పూర్తిగా నివారించమని సూచిస్తున్నారు.

ఎవరైనా మీ బిడ్డను ముద్దు పెట్టుకోవాలనుకుంటే మొహమాటం లేకుండా వద్దని చెప్పాలి. బంధువులు ఏమనుకుంటారో అన్న ఆలోచనకంటే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం.

పిల్లలపై ప్రేమ చూపించడానికి ముద్దు ఒక్కటే మార్గం కాదు. వారిని ప్రేమగా ఎత్తుకోవడం, హగ్ చేసుకోవడం ద్వారా కూడా ఆప్యాయతను తెలియజేయవచ్చు.

పసిప్రాయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఆరోగ్యకరమైన వాతావరణమే పిల్లలకు నిజమైన రక్షణ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.