సాధారణ వెల్లుల్లితో పోలిస్తే నూనెలో తేలికగా వేయించినా లేదా డ్రైగా కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాల్చిన వెల్లుల్లిలో ఏర్పడే సహజ సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతూ రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
ప్రతి రోజు కొద్దిగా వేయించిన వెల్లుల్లిని తీసుకోవడం వల్ల తలపై చుండ్రు సమస్య తగ్గడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
కాల్చిన వెల్లుల్లి జీర్ణక్రియను బలోపేతం చేసి పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదం చేస్తుంది.
వేయించిన వెల్లుల్లిని క్రమంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గి రక్తం గడ్డకట్టకుండా సమతుల్యత ఏర్పడుతుంది.
అలాగే కాల్చిన వెల్లుల్లి రక్తపోటు నియంత్రణలో సహాయపడడంతో పాటు పురుషుల్లో లైంగిక ఆరోగ్యం, శక్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.