పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే, అయితే మనలో చాలామందికి పసుపులో నల్ల పసుపు వెరైటీ ఉంది అన్న విషయం తెలియదు.పసుపుతో పాటు నల్ల పసుపు కూడా శరీరానికి ఉపయోగకరమైన గుణాలతో నిండి ఉంటుంది.
నల్ల పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి శక్తిని ఇచ్చి అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇందులో కర్కుమిన్‌తో పాటు ఫైబర్, జింక్, పొటాషియం, ప్రోటీన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉండటంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వారానికి కనీసం ఒక్కసారి నల్ల పసుపు తీసుకుంటే ఎముకలు బలపడుతూ శరీరానికి దృఢత్వం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు సమస్యతో బాధపడేవారికి ఇది మేలైన సహజ మార్గంగా పనిచేసి కొవ్వు నియంత్రణకు తోడ్పడుతుంది.
మధుమేహం ఉన్నవారు ఆహారంలో నల్ల పసుపును పరిమితంగా చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.