ఈరోజుల్లో చుండ్రు (Dandruff) సమస్య ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోంది.మార్కెట్లో దొరికే షాంపూలు, కండీషనర్లు వాడినా కొంతకాలం మాత్రమే ఫలితం కనిపిస్తుంది. అయితే కెమికల్ ఉత్పత్తులు వాడడం వలన జుట్టు దెబ్బతినే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో చుండ్రును తగ్గించుకోవడం ఉత్తమం.

కొబ్బరి నూనెలో (Coconut Oil) యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది స్కాల్ప్‌లో తేమను నిలబెట్టి చుండ్రును అడ్డుకుంటుంది. కాస్త వేడి చేసిన కొబ్బరి నూనెను కురులకు అప్లై చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 

కలబంద (Aloe Vera) లో యాంటీ మైక్రోబయల్, కూలింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది చుండ్రు కారణమైన ఫంగస్‌ను తొలగించి స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది. అలోవెరా జెల్‌ను నేరుగా స్కాల్ప్‌పై అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

చుండ్రు సమస్యను కెమికల్స్ కాకుండా సహజ పద్ధతుల్లో నియంత్రించడం ఉత్తమం. నిమ్మరసం, కొబ్బరి నూనె, అలోవెరా, బేకింగ్ సోడా వంటి సహజ పదార్థాలను క్రమంగా వాడితే చుండ్రు శాశ్వతంగా తగ్గి, కురులు ఆరోగ్యంగా ఉంటాయి.

బేకింగ్ సోడా (Baking Soda) డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది స్కాల్ప్‌లో ఫంగస్ పెరగకుండా అడ్డుకుంటుంది. ముందుగా తలను నీటితో శుభ్రం చేసి, కొద్దిగా బేకింగ్ సోడాను స్కాల్ప్‌పై రాసి కొంతసేపు ఉంచి కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చుండ్రు సమస్య గణనీయంగా తగ్గిపోతుంది.