ప్రతి ఇంటిలోనూ ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్ (Refrigerator) ఒక అవసరంగా మారింది. వండిన ఆహారం చెడిపోకుండా కాపాడే ఈ యంత్రం కొన్నిసార్లు దుర్వాసనతో ఇబ్బందిపెడుతుంది. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

ఫ్రిజ్ దుర్వాసనకు ప్రధాన కారణం: ఫ్రిజ్‌లో ఎక్కువ వస్తువులు పెట్టడం వల్ల చల్లని గాలి సరైన విధంగా ప్రసరించదు. అలాగే పాత ఆహారం ఎక్కువ రోజులు ఉంచితే అది కుళ్లి వాసన వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రిజ్ ను  శుభ్రంగా ఉంచుకోవాలి.

టూత్‌పేస్ట్–కర్పూరం: ఒక గిన్నెలో మీరు ఉపయోగించే ఏదైనా వైట్ టూత్‌పేస్ట్ (Tooth paste) వేసి, 4 కర్పూరం (Camphor) బిళ్లలను పొడిగా చేసి కలపండి. దీన్ని ఫ్రిజ్‌లో అరగంటపాటు ఉంచితే, దుర్వాసన తగ్గిపోతుంది.

నిమ్మకాయ: నిమ్మకాయ (Lemon) ముక్కలను ఒక ప్లేట్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. నిమ్మలో ఉన్న సిట్రస్ వాసన దుర్వాసనను తొలగిస్తుంది. కావాలంటే కొద్దిగా బేకింగ్ సోడా (Baking Soda) కలపండి. దీనివల్ల మీ ఫ్రిజ్ ఫ్రెష్ గా ఉంటుంది.

న్యూస్ పేపర్: ఒక వార్తాపత్రిక (Newspaper)ను నీటితో తడిపి చిన్న బంతిలా మడిచి ఫ్రిజ్‌లో 8 గంటలు ఉంచండి. అది అన్ని వాసనలను పీల్చుకుంటుంది.

క్లీనింగ్: ప్రతి 10 రోజులకు ఒకసారి ఫ్రిజ్ లోపల, వెలుపల శుభ్రమైన గుడ్డతో తుడవాలి. క్లీన్ గా ఉన్న ఫ్రిజ్ నుంచి ఎటువంటి వాసన రాదు.

ఇలా చేయడం ద్వారా మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగా, వాసన లేకుండా ఉంటుంది. అంతేకాదు మీరు ఫ్రిజ్లో పెట్టే ఆహార పదార్థాలు కూడా ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా హెల్తీగా ఉంటాయి.