వేసవి సెలవులు పిల్లల అభివృద్ధికి మంచి అవకాశం. ఈ సమయంలో వారికి కొత్త విషయాలు నేర్పించడం ద్వారా వ్యక్తిత్వం మెరుగుపరచవచ్చు. సరైన మార్గదర్శకత్వంతో ఇండివిజువాలిటీ పెంపొందుతుంది.
పిల్లలకు తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఇవ్వాలి. చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
వారి ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలి. డ్రాయింగ్, డాన్స్, స్పోర్ట్స్ వంటి కార్యకలాపాల్లో పాల్గొననివ్వాలి. తమ ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుంది.
రోజువారీ చిన్న పనులను వారికి అప్పగించాలి. బాధ్యతను అర్థం చేసుకునేలా చేయాలి. స్వతంత్రంగా పనులు పూర్తి చేయడం అలవాటు అవుతుంది.
స్క్రీన్ టైమ్ను పరిమితం చేయాలి. బదులుగా పుస్తకాలు చదవడం, ఆటలు ఆడడం ప్రోత్సహించాలి. సృజనాత్మకత పెరుగుతుంది.
ప్రకృతితో సమయం గడపనివ్వాలి. బయటి ప్రపంచాన్ని అనుభవించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆలోచనా శక్తి అభివృద్ధి చెందుతుంది.
వారి తప్పులను అంగీకరించేలా ప్రోత్సహించాలి. తప్పుల నుంచి నేర్చుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఇది వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది.
పిల్లలతో సమయం గడపడం చాలా ముఖ్యం. వారి భావాలను వినాలి, అర్థం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతుంది.