పిల్లలు ఎదుగుతున్న సమయంలో సరైన పోషకాలు అందకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రక్తహీనత (Anemia) చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యను నివారించేందుకు పీడియాట్రిషియన్ డాక్టర్లు , న్యూట్రిషన్ స్పెషలిస్టులు కొన్ని ఆహారాలను సూచిస్తున్నారు..

రాగులు, నువ్వులు: రాగులు (Ragi) పిల్లల్లో హిమోగ్లోబిన్ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉన్న ఐరన్‌, క్యాల్షియం ఎముకలను బలపరుస్తాయి. నువ్వులు (Sesame Seeds) కూడా ఐరన్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని మెరుగుపరిచి రక్తహీనతను తగ్గిస్తాయి.

Yellow Leaf
Green Leaf
Squiggly Line

దానిమ్మ (Pomegranate) లో ఐరన్ అధికంగా ఉండి హిమోగ్లోబిన్ పెరగడంలో సహాయపడుతుంది.

Off-white Section Separator
Yellow Leaf

బీట్రూట్ (Beetroot) లో ఐరన్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నందున క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతను తగ్గిస్తుంది.

Off-white Section Separator

డేట్స్ (Dates) పిల్లల్లో శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పిస్తా (Pista) లో ఉన్న విటమిన్లు , మినరల్స్ ఎముకలను బలపరుస్తాయి.

Off-white Section Separator

గోంగూర (Gongura), పాలకూర (Palak),బచ్చల కూర పొన్నగంటాకు వంటి ఆకు కూరలు ఐరన్‌కు మంచి మూలం. వారంలో కనీసం రెండుసార్లు ఆకుకూరలు తినడం వల్ల రక్తహీనత సమస్యతో పాటు కంటి సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

Off-white Section Separator

ఈ ఆహారాలను వారంలో కనీసం రెండు మూడు సార్లు ఇవ్వడం ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గి, శారీరక ఎదుగుదల మెరుగుపడుతుంది.