ఈరోజుల్లో జీవనశైలి (Lifestyle) చాలా వేగంగా మారిపోయింది. బిజీ షెడ్యూల్, అనారోగ్యకరమైన ఆహారం, సమయపాలన లేకపోవడం వంటివి శరీరానికి అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి గ్యాస్ , షుగర్. ఈ రెండు సమస్యలు చాలా మందికి ఇప్పుడు సాధారణమైపోయాయి. కానీ వీటిని నిర్లక్ష్యం చేస్తే శరీరానికి పెద్ద నష్టం కలుగుతుంది.

గ్యాస్ అనేది చిన్న సమస్యలా అనిపించినా, ఇది శరీరంలో అనేక వ్యాధులకు ప్రారంభం అవుతుంది. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడం, అజీర్ణం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు వస్తాయి. దీన్ని పట్టించుకోకపోతే శరీరంలోని జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాదు, గ్యాస్ సమస్య ఎక్కువైతే షుగర్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

ఆయుర్వేదం (Ayurveda) ప్రకారం గ్యాస్, షుగర్ సమస్యలకు మెంతి గింజలు (Fenugreek Seeds) మంచి మందుగా పనిచేస్తాయి. వీటిలో ఉన్న సహజ పోషకాలు శరీరానికి అవసరమైన సమతుల్యతను కలిగిస్తాయి. మెంతి గింజల్లో అధికంగా ఉన్న ఫైబర్ (Fiber) మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఇప్పటి తరం ఆహారపు అలవాట్లలో అధికంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ (Fast Food), పంచదార (Sugar) పదార్థాలు, నిద్రలేమి, ఒత్తిడి ఇవన్నీ షుగర్ రావడానికి ప్రధాన కారణాలు. షుగర్ వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా మారి, అలసట ఎక్కువగా ఉంటుంది. సరైన ఆహార నియమాలు పాటిస్తే, ఈ సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు.

Monitoring speed

Single automated system like adaptive cruise control features, e.g. monitoring speed

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని (Heart Health) కాపాడుతుంది.ఇవి ఆకలిని నియంత్రించి త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీని వలన బరువు తగ్గడం  సులభం అవుతుంది.యాంటీ ఇన్‌ఫ్లమేటరీ  లక్షణాలు ఉన్నందున శరీరంలో వాపు, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

రాత్రి పూట కొద్దిగా మెంతి గింజలు నీటిలో నానబెట్టాలి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఆ గింజలను నీటితో కలిపి తాగేయాలి. గింజలు మింగలేని వారు ఒట్టి నీటిని వడగట్టుకుని తాగిన ఫలితం ఉంటుంది. ఇలా క్రమంగా చేస్తే, శరీరంలో మార్పులు కనిపిస్తాయి.