వంటగది(Kitchen) అంటే ఇంటి గుండె అని అంటారు. కుటుంబం ఆరోగ్యం వంటగదిలోనే మొదలవుతుంది. కానీ సింక్‌ను (Sink) నిర్లక్ష్యం చేస్తే, మురికి పాత్రలతో పాటు ఆహార అవశేషాలు పైపుల్లో చిక్కుకుపోతాయి. ఇది క్రమంగా కుళ్లిపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. కాబట్టి కిచెన్ సింక్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం.

ఉప్పు - నిమ్మకాయ కొద్దిగా ఉప్పు (Salt) నీటిలో కరిగించి, దానిలో బేకింగ్ సోడా(Baking Soda) , నిమ్మరసం (Lemon juice) కలపాలి. ఈ మిశ్రమాన్ని సింక్ డ్రెయిన్‌లో (Sink drain) పోయి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది వాసనను తొలగించి తాజాదనాన్ని ఇస్తుంది.

వేడి నీరు, డిష్ వాష్ లిక్విడ్ వేడి నీటిలో డిష్ వాష్ లిక్విడ్ (Dish Wash liquid) కలిపి సింక్‌లో పోయాలి. ఇది పైపుల్లోని జిడ్డు పొరలను కరిగించి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అరగంట తర్వాత మళ్లీ వేడి నీటితో కడగడం మంచిది.

నిమ్మ తొక్క – బేకింగ్ సోడా ఒక నిమ్మకాయను కట్ చేసి దానిపై బేకింగ్ సోడా చల్లి సింక్ చుట్టూ రుద్దాలి. ఇది వాసనను పూర్తిగా పోగొడుతుంది.

వైట్ వెనిగర్ వైట్ వెనిగర్‌ను (White Vinegar) నీటిలో కలిపి కొన్ని చుక్కల నిమ్మరసం జోడించాలి. రాత్రిపూట ఈ ద్రావణాన్ని సింక్‌లో పోసి ఉదయం కడిగితే దుర్వాసనతో పాటు క్రిములు కూడా మాయం అవుతాయి.

హెల్తీ కిచెన్ రోజూ సింక్ చుట్టూ నీరు నిల్వ కాకుండా చూడాలి. డ్రెయిన్‌లో ఆహార ముక్కలు వెళ్లకుండా ఫిల్టర్ వాడాలి. ఇవి పాటిస్తే కిచెన్ ఎప్పుడూ క్లీన్‌గా, వాసనలేని ప్రదేశంగా ఉంటుంది.

హామ్ ఫుల్ కెమికల్స్ ఉపయోగించే బదులు ఇలా ఇంటి వద్దనే సహజమైన పదార్థాలతో..ఇంటి చిట్కాలతో వంటగదిలో సింక్ శుభ్రంగా ఉంచుకోవచ్చు.