ఇంట్లో ఎలుకలు వచ్చేస్తే ఇల్లంతా గందరగోళంగా మారిపోతుంది. తినే పదార్థాలు, బట్టలు, ఫర్నీచర్—ఏదీ సేఫ్ కాదు. పైగా వీటిని తరిమేందుకు మందులు వాడితే వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ప్రమాదం ఎక్కువ.

కెమికల్ ఫ్రీ సొల్యూషన్ ఎలుకల కోసం రసాయనాలతో చేసిన మందుల కంటే సహజ పద్ధతులు చాలా సేఫ్. వాటిలో ఒకటి నారింజ తొక్కలు (Orange peels) వాడడం. వీటివల్ల ఇల్లంతా సువాసన వస్తుంది, ఎలుకలు మాత్రం ఆ వాసన తట్టుకోలేవు.

Cutout

నారింజ తొక్కల మ్యాజిక్ నారింజలో ఉండే సహజ నూనెల వాసన ఎలుకలకు అస్సలు నచ్చదు. ఈ ఘాటైన స్మెల్ కారణంగా అవి ఆ ప్రదేశానికి రావు. దీని వల్ల ఎలుకల సమస్యకు సహజ పరిష్కారం లభిస్తుంది.

ఎలా వాడాలి? తాజా నారింజ తొక్కలను స్వల్పంగా పిండాలి, అందులోని నూనెలు బయటకు వస్తాయి. ఆ తొక్కలను ఎలుకలు తిరిగే మూలల్లో, బీరువాల్లో లేదా ఫర్నీచర్ దగ్గర ఉంచాలి. చిన్న రంధ్రాల్లో కూడా వేయవచ్చు.

తొక్కలు ఎప్పుడు మార్చాలి? ఈ తొక్కల వాసన రెండు రోజుల తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి రెండు మూడు రోజులకు కొత్త తొక్కలు వేయాలి. ఈ ప్రక్రియను ఎలుకలు పూర్తిగా పారిపోయే వరకు కొనసాగించాలి.

పొడి రూపంలో ఉపయోగం నారింజ తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసి చిన్న గుడ్డలలో కట్టి ఇంటి మూలల్లో ఉంచండి. వారానికి ఓసారి వాసన తగ్గిందో లేదో చెక్ చేయండి. దీని వల్ల ఎలుకలు తిరిగి రావు.

ఇలా సింపుల్‌గా నారింజ తొక్కల సాయంతో ఎలుకల సమస్యను సురక్షితంగా, సువాసనతో సహజంగా పరిష్కరించుకోవచ్చు..