మన బాత్రూమ్ లేదా కిచెన్ సింక్ దగ్గర చిన్నగా ఎగిరే ఈగలు కనిపిస్తాయి. వీటినే డ్రెయిన్ ఫ్లైస్ (Drain Flies) అంటారు. ఇవి తడి, చెమ్మ ఎక్కువగా ఉన్న చోట్లే పెరుగుతాయి. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ చాలా ఇబ్బంది పెడతాయి.
ఈగల వల్ల సమస్యలు: స్నానం చేసే సమయంలో లేదా పనులు చేసేటప్పుడు ఇవి చుట్టూ తిరుగుతూ చికాకు పెడతాయి. పైగా పరిశుభ్రత లేకపోతే వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ.
డ్రెయిన్ ఫ్లైస్ ఎలా గుర్తించాలి: సామాన్యంగా ఇవి లేత గోధుమ రంగులో ఉంటాయి. బాగా ఎగరలేవు. గోడలు లేదా డ్రెయిన్ చుట్టుపక్కల అతుక్కుంటాయి. ఎక్కువగా బాత్రూమ్ బేసిన్, కిచెన్ సింక్ (Kitchen Sink) దగ్గర కనిపిస్తాయి.
నల్ల మిరియాల చిట్కా: నల్ల మిరియాల్ని మెత్తగా దంచి పొడి చేయాలి. రెండు టీ స్పూన్లు పొడిని ఒక కప్పు నీటిలో కలిపి వడకటి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని డ్రెయిన్లు, సింక్‌లు చుట్టూ పిచికారీ చేస్తే ఈగలు దగ్గరకు రావు. మిరియాల ఘాటైన వాసన వీటిని దూరంగా ఉంచుతుంది.
బేకింగ్ సోడా–నిమ్మరసం: ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ నీటిలో కలిపి, రెండు నిమ్మకాయల (Lemon) రసం వేసి బాగా కలపాలి. దీన్ని స్ప్రే చేసి డ్రెయిన్ ప్రాంతం శుభ్రం చేస్తే ఈగలు మాయం అవుతాయి.
రోజువారీ శుభ్రత అవసరం: డ్రెయిన్ దగ్గర చెత్త, జుట్టు పేరుకుపోనివ్వకండి. కాస్త వేడి నీటిని రోజుకి ఒకసారి డ్రెయిన్‌లో పోయండి. బాత్రూమ్‌లో నీరు నిలిచిపోకుండా వైపర్‌తో శుభ్రం చేయండి. తేమ తగ్గిస్తే ఈగలు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే బాత్రూమ్ డ్రెయిన్ ఈగల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.