ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అదే నీటిలో కొన్ని సహజ పదార్థాలు కలిపి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్‌గా తాగితే శరీరానికి మరిన్ని లాభాలు అందుతాయి.

ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అంటే సాధారణ నీటిలో పండ్లు, ఆకులు లేదా కూరగాయలు వేసి కొంతసేపు నానబెట్టిన నీరు. ఇందులో అదనంగా చక్కెర లేదా కెమికల్స్ ఉండవు. సహజ రుచితో పాటు పోషకాలు కూడా అందుతాయి.

 ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపేందుకు సహాయపడుతుంది. మెటబాలిజం చురుకుగా పనిచేస్తుంది. దీంతో అలసట తగ్గి రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

ఒక బాటిల్ నీటిలో నిమ్మకాయ ముక్కలు, దోసకాయ స్లైసులు, పుదీనా ఆకులు లేదా అల్లం ముక్కలు..ఇలా మీ ఛాయస్ కి తగ్గిన ఫ్రూట్ లేదా వెజిటబుల్ ముక్కలు వేయాలి. రాత్రి మొత్తం లేదా కనీసం 4–5 గంటలు నానబెట్టాలి.

ఉదయం లేవగానే ఈ నీటిని ఫిల్టర్ చేసుకోని తాగితే శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి అలవాటు.

ప్రతిరోజూ ఒకే రకం కాకుండా పదార్థాలు మార్చుకుంటూ తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యకరమైన రోజు ప్రారంభానికి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ మంచి ఎంపిక.