27th April 2026

Arrow

____________

- Saidulu

ఇడ్లీ, దోస పిండి తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఇడ్లీ, దోస పిండి చాలా వేగంగా పులిసిపోతుంది. అందుకే పిండిని సరిగ్గా నిల్వ చేయడం చాలా అవసరం.

చాలామంది సమయం ఆదా కోసం ఒకేసారి ఎక్కువ పిండిని తయారు చేస్తారు. కానీ సరైన విధంగా ఉంచకపోతే అది త్వరగా పాడైపోతుంది.

పిండిలో ఉప్పు ఎక్కువగా వేయడం వల్ల అది త్వరగా పుల్లగా మారుతుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే ఉప్పు వేయడం మంచిది.

అలాగే పిండి స్మూత్గ ఉండడం కోసం మెంతులు ఎక్కువగా వాడితే పిండి త్వరగా పులుస్తుంది. వేసవిలో ఇవి తక్కువగా వాడితే మంచిది.

పిండి రెట్టింపు అయ్యే వరకు బయట ఉంచి వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎక్కువసేపు బయట ఉంచితే రుచి మారిపోతుంది.

ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత అవసరమైనంత మాత్రమే తీసుకుని మిగిలినది తిరిగి వెంటనే లోపల పెట్టాలి. బయట ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు.

పిండి పుల్లగా మారితే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ లేదా కొద్దిగా బియ్యపు పిండి కలిపితే రుచి మెరుగవుతుంది.

పంచదార లేదా బెల్లం కొద్దిగా కలిపితే పులుపు తగ్గి దోసెల రుచి బాగుంటుంది. కానీ ఎక్కువ చక్కెర కలిపితే పిండి జీడుగా మారుతుంది.

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా ఇడ్లీ, దోస పిండిని 3 నుంచి 5 రోజులు తాజాగా ఉంచుకోవచ్చు. ఆహారం వృథా కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.