ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే టైప్–2 (Type 2 diabetes) డయాబెటిస్ రావడం ఎక్కువైందని వైద్య నిపుణులు (Medical Experts) హెచ్చరిస్తున్నారు. అధిక బరువు, కదలికలేని జీవనశైలి (Life Style) , చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
ఫ్యామిలీ హిస్టరీ: తల్లిదండ్రులు లేదా దగ్గరి బంధు వుల్లో ఊబకాయం (obesity) లేదా డయాబెటిస్ (Diabetes) ఉంటే, పిల్లలకు కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని స్పెషలిస్టులు (Specialists) అంటున్నారు. కాబట్టి ఇటువంటి హెల్త్ ఇష్యూస్ కుటుంబ చరిత్ర ఉంటే..ఆ పిల్లలను ప్రత్యేకంగా గమనించాలి.
ప్రైమరీ సింప్టమ్స్: టైప్–2 డయాబెటిస్ ఉన్న పిల్లలకు తరచూ దాహం వేయడం, రోజులో అనేకసార్లు మూత్ర విసర్జన చేయడం కనిపిస్తుంది. రక్తంలో చక్కెర ఎక్కువైతే మూత్రపిండాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో దాహం పెరుగుతుంది.
బరువు తగ్గడం: సరిగ్గా తిన్నా కూడా బరువు తగ్గడం టైప్–2 డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకోలేకపోవడం వల్ల పిల్లలు సులభంగా అలసిపోతారు. చిన్న పనులు చేసినా నీరసం కనిపిస్తుంది.
ఐ ఇష్యూస్: అధిక చక్కెర కారణంగా పిల్లల్లో చూపు బలహీనపడడం, దృష్టి మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే మెడ, చేతుల దగ్గర నల్లటి చర్మపు మచ్చలు (Acanthosis Nigricans) కనిపిస్తే కూడా ఇది ఇన్సులిన్ నిరోధకతకు సంకేతం.
ఇమ్మ్యూనిటి లోపం: రోగనిరోధక శక్తి బలహీనపడడం వల్ల గాయాలు త్వరగా మానవు, తరచూ ఇన్ఫెక్షన్లు రావచ్చు. అదనంగా, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లల్లో ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం.