అటుకులు మనలో చాలా మందికి స్నాక్స్‌లా అనిపించినా, ఇవి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్స్, పైబర్, ప్రోటీన్, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా రాత్రి డిన్నర్‌గా తీసుకోవచ్చు.
ఆరోగ్యాన్ని పెంచే సింపుల్ ఫుడ్
డైట్ చేసేవారికి సరైన ఆప్షన్ బరువు తగ్గాలనుకునేవారికి అటుకులు చాలా ఉపయోగకరమైనవి. ఇవి తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా క్రేవింగ్స్ తగ్గుతాయి. ఫుడ్ కంట్రోల్‌లో ఉంటుందనే అర్థం.
గుండెకు మంచిది
అటుకుల్లో లాక్టోస్ (Lactose) , గ్లూటెన్ (Gultein) లాంటి పదార్థాలు ఉండవు. గోధుమ ఫుడ్ తినలేనివారికి ఇవి బెస్ట్. ఇవి హార్ట్ హెల్త్‌కు మేలు చేస్తాయి. తక్షణం ఎనర్జీని అందిస్తాయి.
జీర్ణవ్యవస్థ
అటుకులు ప్రోబయోటిక్ (Probiotic) గుణాలు కలిగి ఉంటాయి. రెగ్యులర్‌గా తింటే జీర్ణ సమస్యలు, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో కూరగాయలు, పల్లీలు కలిపితే ప్రోటీన్, ఫైబర్ పెరుగుతుంది.
ఐరన్ అటుకుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. పైగా నిమ్మరసం కలిపి తింటే ఐరన్ అబ్జార్ప్షన్ మరింత మెరుగవుతుంది.
పోహా (Poha) ఒకే రకం కాదు — రెడ్ పోహా, వైట్ పోహా, మొలకెత్తిన మట్కి పోహా లాంటి ఎన్నో రకాలుగా లభిస్తుంది. రెడ్ పోహాలో ఎక్కువ విటమిన్ బి, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి.
ఎన్నో రకాలుగా ఆస్వాదించవచ్చు
రోజూ తినే భోజనంలో అటుకులను చేర్చుకుంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.