ఉదయం లేవగానే కృతజ్ఞత భావంతో రోజును ప్రారంభిస్తారు. ఇది మనసుకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.
తమ శరీరానికి కొంత సమయం కేటాయిస్తారు. వ్యాయామం లేదా నడక ద్వారా ఉత్సాహంగా ఉంటారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై దృష్టి పెడతారు. ఇది శరీరం, మెదడు రెండింటినీ చురుకుగా ఉంచుతుంది.
తమకు ఇష్టమైన పనులు చేయడానికి టైమ్ కేటాయిస్తారు. హాబీలు మనసుకు రిలాక్స్‌ను ఇస్తాయి.
సానుకూల ఆలోచనలతో రోజును ముందుకు తీసుకెళ్తారు. నెగటివిటీకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటానికి సమయం కేటాయిస్తారు. ఇది భావోద్వేగాలను బలంగా ఉంచుతుంది.
చిన్న విజయాలను కూడా ఆనందంగా జరుపుకుంటారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఈ అలవాట్లను జీవితంలో చేరుస్తే ఆనందం సహజంగా వస్తుంది. హ్యాపీగా ఉండటం కూడా ఒక మంచి అలవాటే.