సంతానోత్పత్తి ఆలస్యం కావడానికి అండోత్సర్గ లోపాలు, హార్మోన్ అసమతుల్యత, గుడ్డు నాణ్యత తగ్గడం వంటి కారణాలు ఉన్నా, ఇది సాధారణ సమస్యేనని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యమైన జీవనశైలి, ఫెర్టిలిటీపై పెద్ద ప్రభావం చూపిస్తుంది. సరైన ఆహారం, స్ట్రెస్ లేకుండా ఉండటం, సమయానికి నిద్ర ఇవన్నీ కంజీవ్ అవ్వాలి అనుకునేవారికి చాలా మేలు చేస్తాయి.క్రమంగా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం.
మెన్స్ట్రువల్ సైకిల్లో మొదటి 10 రోజులలో అల్లం, దాల్చిన చెక్క, లవంగాలతో చేసిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించి, ఎగ్ క్వాలిటీ పెరగడానికి సహాయపడుతుంది. ఓవులేషన్ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.
జీలకర్రను రాత్రి నానబెట్టి ఉదయం మరిగించి తాగే నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ప్రొజెస్టెరాన్ స్థాయిలను సహజంగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఖాళీ కడుపుతో తీసుకోవడం ఉత్తమం.
తులసి ఆకులు, నిమ్మ ముక్కలు కలిపిన నీరు ఉదయం తాగితే కార్టిసాల్ తగ్గి మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. స్ట్రెస్ తగ్గడం ఫెర్టిలిటీకి ఎంతో ఉపయోగకరం అని వైద్యులు పేర్కొంటారు.
సైకిల్లో 15 నుంచి 26వ రోజు వరకు అవిసె గింజలు, నువ్వులు కలపిన నీటిని తాగితే ప్రొజెస్టెరాన్కు మద్దతు లభించి, పీఎంఎస్, స్పాటింగ్ తగ్గుతాయి.