5th May 2026

____________

- Saidulu

కరకరలాడే ఫ్రైడ్ పొటాటో స్నాక్ రిసిపీ

క్రిస్పీ ఫ్రైడ్ పొటాటో స్నాక్ ఇంట్లో సులభంగా తయారు చేసుకునే టేస్టీ ఐటమ్. టీ టైమ్‌లో లేదా స్నాక్స్‌గా తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే రుచి.

ముందుగా ఆలుగడ్డలను తొక్క తీసి పలుచగా స్లైసులు కట్ చేయాలి. ఇవి సమానంగా ఉండేలా చూసుకుంటే ఫ్రై బాగా అవుతుంది.

కట్ చేసిన స్లైసులను నీటిలో కాసేపు నానబెట్టాలి. దీంతో అదనపు స్టార్చ్ బయటకు వస్తుంది.

తరువాత వాటిని గుడ్డతో తుడిచి పూర్తిగా పొడిగా చేయాలి. తడి ఉంటే కరకరలాడే టెక్స్చర్ రాదు.

ఇప్పుడు నూనె వేడి చేసి ఆలుగడ్డ స్లైసులను వేయించాలి. మధ్యస్థ మంటపై నెమ్మదిగా వేయిస్తే మంచి క్రిస్పీగా వస్తాయి.

వేయించిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా మసాలా పొడి వేసి కలపాలి. రుచికి అనుగుణంగా సీజనింగ్ మార్చుకోవచ్చు.

ఇంకా రుచిగా కావాలంటే కొద్దిగా మిరియాల పొడి లేదా చాట్ మసాలా కూడా చల్లుకోవచ్చు. ఇది ప్రత్యేక టేస్ట్ ఇస్తుంది.

ఇలా తయారైన క్రిస్పీ ఫ్రైడ్ పొటాటో స్నాక్ వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. హాలిడేస్ సీజన్ లో పిల్లలకు ఫాస్ట్ గా చేసి చేసి పెట్టే ఈ ఈజీ స్నాక్ ట్రై చేయండి.