చిన్నవిగా కనిపించే బొద్దింకలు (Cockroaches) ఇంట్లో పెద్ద సమస్యగా మారతాయి. ముఖ్యంగా చలికాలంలో ఇవి వేడి ప్రదేశాలను, ఆహారం ఉండే రాక్స్ ను ఆశ్రయిస్తాయి. మురికి ఉన్న ప్రదేశాల్లో వీటి పెరుగుదల ఎక్కువ. ఇవి ఆహారాన్ని కలుషితం చేయడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా పెంచుతాయి.
ఆరోగ్య సమస్యలు: బొద్దింకల వల్ల అలెర్జీలు, ముక్కు దిబ్బడ, కళ్ల నీరు కారడం, శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. నిపుణుల ప్రకారం, ఇవి పిల్లలకు,వృద్ధులకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయి.
కెమికల్స్: బొద్దింకలను నిర్మూలించడానికి మార్కెట్లో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ వాటిలో హామ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఇది ఉపయోగించడం వల్ల ఇంట్లో పిల్లలకు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎక్కువగా వాడకూడదు.
చక్కెర–బోరిక్ పౌడర్ మిశ్రమం: ఇంట్లో ఉన్న బొద్దింకలను సహజంగా తరిమి కొట్టడానికి చక్కెర (Sugar) బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు చెంచాల బోరిక్ పౌడర్లో (Boric Powder) రెండు చెంచాల చక్కెర కలిపి, బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో ఉండలు చేసి పెట్టాలి. బొద్దింకలు షుగర్ కి అట్రాక్ట్ అయి ఈ మిశ్రమాన్ని తిని బోరిక్ పౌడర్ ఎఫెక్ట్ వల్ల చనిపోతాయి.
బేకింగ్ సోడా: ఒక చెంచా బేకింగ్ సోడా (Baking Soda) ,అంతే పరిమాణంలో చక్కెరను కలిపి ఇంట్లోని మూలల్లో చల్లితే, మిశ్రమం తిన్న బొద్దింకలు చనిపోతాయి.
నాచురల్ స్ప్రే: 1 కప్పు వేప నూనె, ½ కప్పు ఉల్లిపాయ రసం, 1 టీస్పూన్ నల్ల మిరియాల పొడిని నీటిలో కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ స్ప్రేను కిచెన్ సింక్, డ్రెయిన్లు, తలుపుల అంచులు, గోడ పగుళ్ల వద్ద పిచికారీ చేస్తే బొద్దింకలు దూరంగా పరుగెడతాయి.
వేప నూనె కీటకాలు పెరగకుండా అడ్డుకుంటుంది. ఉల్లిపాయ (Onion) , నల్ల మిరియాల (Black Pepper) ఘాటు వాసన బొద్దింకలను తరిమి కొడుతుంది. ఈ మిశ్రమం వల్ల ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా ఇది మంచి రూమ్ ఫ్రెష్నేర్గా పని చేస్తుంది.