సినీ ఇండ‌స్ట్రీలో టాలెంట్ ఒక్క‌టే స‌రిపోదు, దానికి ఆవ‌గింజంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే కెరీర్లో ముందుకెళ్తారు.

ఆ అదృష్టం లేక‌పోతే తెలుగ‌మ్మాయి డింపుల్ హ‌యాతి లాగానే ఎంత క‌ష్ట‌ప‌డినా, ఎంత అంద‌మున్నా స్టార్ గా ఎద‌గ‌లేరు.

డింపుల్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగేళ్ల‌కు పైగా అవుతుంది ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన క్రేజ్ రాలేదు. గ‌ల్ఫ్ మూవీతో హీరోయిన్ గాఎంట్రీ ఇచ్చిన డింపుల్, త‌ర్వాత యూరేకా మూవీలో న‌టించింది.

ఆ రెండు సినిమాలూ ఫ్లాప‌వడంతో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేసి మంచి క్రేజ్ అందుకుంది.

ఆ క్రేజ్ తో ర‌వితేజ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసి ఖిలాడీ మూవీలో న‌టించింది కానీ లాభం లేక‌పోయింది. అయినా స‌రే తాజాగా మ‌రోసారి ర‌వితేజ తో క‌లిసి భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీలో న‌టించింది.

ఆ క్రేజ్ తో ర‌వితేజ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసి ఖిలాడీ మూవీలో న‌టించింది కానీ లాభం లేక‌పోయింది. అయినా స‌రే తాజాగా మ‌రోసారి ర‌వితేజ తో క‌లిసి భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీలో న‌టించింది.