నిద్ర పట్టడంలేదా? కారణాలు తెలుసుకోండి..

24th March 2026

White Scribbled Underline

నిద్ర లేకపోవడం లేదా ఇన్‌సోమ్నియా అనేది ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

రాత్రంతా నిద్ర పట్టకపోవడం లేదా మధ్యలో మెలుకువ రావడం వల్ల శరీరం, మనసు రెండూ అలసటకు గురవుతాయి.

ఇన్‌సోమ్నియా లక్షణాల్లో ముఖ్యంగా రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం , నిద్రపోయినా మధ్యలో మెలుకువ  రావడం సాధారణం.

ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, రోజంతా నిద్రగా ఉండటం కూడా ఈ సమస్యకు సంకేతాలు. కాన్సంట్రేషన్ తగ్గడం, చిరాకు పెరగడం కూడా కనిపిస్తాయి.

ఇన్‌సోమ్నియాకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. ఎక్కువగా ఆలోచించడం, టెన్షన్, ఆందోళన వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది.

మొబైల్, ల్యాప్‌టాప్ వాడకం ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం. రాత్రి వరకు స్క్రీన్ చూసే అలవాటు మీ స్లీప్ సైకిల్ ను దెబ్బతీస్తుంది.

అసమయ ఆహారం, కాఫీ లేదా టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవడం కూడా కారణంగా ఉంటుంది.

ఇన్‌సోమ్నియాను తగ్గించడానికి కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం మంచిది.

నిద్రకు ముందు మొబైల్ వాడకం తగ్గించడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉపయోగపడుతుంది. ప్రశాంత వాతావరణంలో నిద్రపోవడం చాలా ముఖ్యం.

రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇలా జీవనశైలిలో మార్పులు చేసుకుంటే నిద్ర సమస్యలు తగ్గుతాయి.

జీర్ణక్రియ & గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు తినాల్సిన ఫైబర్ ఫుడ్స్